తెలంగాణ

telangana

ETV Bharat / business

అనిల్​ అంబానీని వదలని ఎరిక్సన్​ - AMBANI

సుప్రీం కోర్టుకు ఎరిక్సన్​...550 రుణం చెల్లింపు వివాదం. తదుపరి విచారణ రేపటికి వాయిదా.

అనిల్​ అంబానీ

By

Published : Feb 12, 2019, 7:05 PM IST

తమకు రావాల్సిన రూ.550 కోట్ల రుణాన్ని చెల్లించాల్సిందిగా రిలయన్స్​ కమ్యూనికేషన్​(ఆర్​కామ్​)ను ఆదేశించాలని ఎరిక్సన్​ ఇండియా దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

విచారణకు అనిల్​ అంబానీ సహా రిలయన్స్​ టెలికాం చైర్మన్​ సతీష్​సేత్​, ఇన్​ఫ్రాటెల్​ లిమిటెడ్​ చైర్మన్​ ఛాయ విరాణి జస్టిస్​ నారీమన్​, వినీత్​ శరణ్​ ధర్మాసనం ముందు హజరయ్యారు. బుధవారం కూడా విచారణకు రావాలని కోర్టు వారిని ఆదేశించింది.

ఇంతకు ముందు కోర్టు ఇచ్చిన రెండు ఆదేశాలను పాటించకుండా ఆర్​కామ్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఎరిక్సన్​ తరపు న్యాయవాది దుశ్యంత్​ వాదనలు వినిపించారు.

ఒకవేళ రుణం చెల్లించడంలో విఫలమైతే అంబానీ, సేత్​, విరాణిలపై సివిల్​ కేసు నమోదు చేసి అరెస్టుకు ఆదేశించాలని ఎరిక్సన్​ పిటిషన్​లో కోరింది.

ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

పోయిన ఏడాది డిసెంబర్​ 15లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలని గతంలో ఆర్​కామ్​ సుప్రీంని ఆదేశించింది. ఈ గడువు దాటితే సొమ్ముపై 12 శాతం వడ్డీ చెల్లించాల్సింటుందని స్పష్టం చేసింది. అయితే రుణ చెల్లింపులో విఫలమైంది ఆర్​కామ్​. దీంతో ఎరిక్సన్​ మళ్లీ సుప్రీం తలుపుతట్టింది.

2014లో ఆర్​కామ్​ నెట్​వర్క్​ను ఏడు సంవత్సరాల పాటు నిర్వహించేందుకు ఎరిక్సన్​ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి 1500 కోట్లు ఎరిక్సన్​కు ఆర్​కామ్ బకాయి పడింది. దీనిపై అప్పట్లో జాతీయ లా ట్రైబ్యునల్​లో పిటిషన్​ దాఖలు చేసింది ఎరిక్సన్​. సుప్రీంలో 1500 కోట్లకు బదులు ఒకేసారి 550కోట్లు చెల్లింపునకు ఎర్సికన్​కు- ఆర్​కామ్​కు మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఇదీ అమలు కాలేదు.

ABOUT THE AUTHOR

...view details