తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి ఆనంద్​ మహీంద్రా గుడ్​ బై! - మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్​ పదవికి ఆనంద్ మహీంద్రా గడ్​బై

మహీంద్రా గ్రూప్​ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి ఆనంద్​ మహీంద్రా త్వరలో తప్పుకోనున్నారు. 2020 ఏప్రిల్ 1​న ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు సంస్థ అధికారిక ప్రకటన చేసింది.

MAHINDRA
ఆనంద్​ మహీంద్రా

By

Published : Dec 20, 2019, 3:25 PM IST

దేశీయ దిగ్గజ సంస్థ మహీంద్రా గ్రూప్​ నేడు కీలక ప్రకటన చేసింది. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​ పదవి నుంచి ఆనంద్​ మహీంద్రా త్వరలో తప్పుకోనున్నట్లు వెల్లడించింది.

"ఆనంద్​ మహీంద్రా ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్ పదవి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 1న తప్పుకోనున్నారు. ఆ తర్వాత ఆయన మహీంద్రా అండ్​ మహీంద్రా నాన్​ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా కొనసాగుతారు. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం."
-మహీంద్రా గ్రూప్ అధికారిక ప్రకటన

నాన్​ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా.. ఆనంద్​ మహీంద్రా డైరెక్టర్ల బోర్డు మెంటర్​గా, కంపెనీ వ్యూహాత్మక ప్రణాళిక, రిస్క్​ మేనేజ్​మెంట్​ వంటి పలు బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఆనంద్ మహీంద్రా.. ఛైర్మన్​ పదవి నుంచి వైదొలిగిన అనంతరం పవన్ గోయెంకా ఎండీ, చీఫ్​ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా బాధ్యతలు తీసుకోనున్నారు.

ఇదీ చూడండి:కోటికిపైగా ఫాస్టాగ్​లు విక్రయం​: ఎన్​హెచ్​ఏఐ

ABOUT THE AUTHOR

...view details