తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్ ఏజీఎంలో ఈసారి కీలక ప్రకటనలు ఇవే!

రిలయన్స్ ఇండస్ట్రీస్.. దేశంలో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ ఇదే. సంస్థకు చెందిన టెలికాం విభాగం జియోకు వచ్చిన భారీ పెట్టుడులతో ఈ స్థాయికి ఎదిగింది. ఈ ఉత్సాహంతోనే సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశం బుధవారం (ఏజీఎం)నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతి ఏటా వాటాదారులను ఉత్సాహపరిచే ప్రకటనలు చేసే రిలయన్స్.. ఈ సారి రుణరహితంగా కూడా మారిపోయింది. మరి ఏజీఎంలో ఎలాంటి ప్రకటనలు చేసే అవకాశముంది? దీనిపై 'ఈటీవీ భారత్' అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం..

reliance agm
రిలయన్స్ ఏజీఎం

By

Published : Jul 14, 2020, 8:37 PM IST

Updated : Jul 15, 2020, 9:43 AM IST

జియోలోకి వరుస పెట్టుబడులతో ఉత్సాహం మీదున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్​) ఇప్పుడు అదే ఊపుతో సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించేందుకు సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్​ఐఎల్ ఏజీఎం జరగనుంది.

గతంలో ఏజీఎంలో మాట్లాడుతున్న ముకేశ్

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈ సారి ఏజీఎంను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహిస్తోంది రిలయన్స్. జియో నుంచి ఇటీవలే విడుదలైన జియో మీట్ వీడియో కాన్ఫరెన్స్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26 లక్షల మంది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులు ఇందులో పాల్గొననున్నారు.

ఏజీఎంకు ఎందుకంత ప్రత్యేకత..

సాధారణంగా రిలయన్స్ ఏజీఎంలో వాటాదారులను ఉత్సాహపరిచే ఎన్నో ప్రకటనలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు, కొత్త వ్యాపారాలు, ఒప్పందాలను వెల్లడిస్తుంటుంది సంస్థ.

ముఖ్యంగా 2016లో జియోను ఆవిష్కరించినప్పటి నుంచి రిలయన్స్ ఏజీఎం అంటే సంస్థ వాటాదారులకు పండగలా మారిపోయింది. ఏటా ఇందులో సంస్థ భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించడం.. వాటిని అనుకున్నట్లుగానే పూర్తి చేయడం వంటివి చేస్తోంది. ఈ కారణంగా ప్రతి ఏటా రిలయన్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని వాటాదార్లలో భారీ అంచనాలు ఉంటాయి.

గత ఏజీఎంలో ముకేశ్​ అంబానీ కుటుంబ సభ్యులు

రుణ రహితంగా కంపెనీ..

గత ఏజీఎంలో చెప్పినట్లుగానే సంస్థను రుణ రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది రిలయన్స్. నిజానికి అప్పుడు 2021 మార్చి నాటికి సంస్థలను రుణ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది సంస్థ. అయితే అంతకన్నా ముందే అప్పులు లేని సంస్థగా అవతరించేందుకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడం గమనార్హం.

ఫేస్​బుక్ మొదలుకొని క్వాల్కమ్​ వరకు మొత్తం 12 సంస్థలు 13 దఫాల్లో జియోలో రూ.1,18,318.45 కోట్లు పెట్టుబడి పెట్టాయి. రైట్స్ ఇష్యూ ద్వారా కూడా భారీగా (రూ.53,124 కోట్లు) నిధులు సమీకరించుకుంది రిలయన్స్. ఈ పెట్టుబడులతో రుణ రహితంగా మారేందుకు కావాల్సిన నిధులు సమకూరినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవలే ప్రకటించారు. దీనితో ఈ సారి ఏజీఎంలో భవిష్యత్​ ప్రణాళికలు ఎలా ఉండనున్నాయో అనే అంచనాలు మరింత పెరిగాయి.

రిలయన్స్ టెలికాం విభాగం జియో

ఈ సారి ప్రకటనల్లో వీటికి అవకాశం!

  • ఫేస్‌బుక్‌ అధీనంలోని మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సాయంతో జియోమార్ట్‌ కార్యకలాపాలు సాగుతున్నాయి. భారీగా నిధులు సమీకరించిన జియో ప్లాట్‌ఫామ్స్‌ను అంతర్జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తారనే అంచనాలున్నాయి.
  • దేశీయ మొబైల్‌నెట్​వర్క్​ విపణిలో రిలయన్స్‌ జియో అగ్రగామిగా ఎదిగింది. 36 శాతం వాటా పొందింది. 2024కు చందాదార్ల పరంగా 41 శాతం వాటా, ఆదాయం పరంగా 44 శాతం వాటా సాధించాలనేది సంస్థ లక్ష్యం. కేబుల్​తో అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించే జియో ఫైబర్‌పై సంస్థ మరింత దృష్టి సారించే అవకాశం ఉంది.
  • చమురు-రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను.. ప్రపంచంలోనే ముడిచమురు అధికంగా ఎగుమతి చేసే సౌదీ చమురు అగ్రగామి సంస్థ ఆరామ్‌కోకు 2,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,12,500 కోట్లు)కు విక్రయించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని గతేడాది ఆర్‌ఐఎల్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. అయితే కరోనా వల్ల ఈ ఒప్పందం కుదరలేదు. ఈ సారి ఏజీఎంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
  • జపాన్‌ కంపెనీ సుజుకీ (టీసుజుకీ) హరియాణా (ఝజ్జర్‌)లోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ మోడల్‌ ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ (ఎంఈటీఎల్‌)లో తయారీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. వాహన పరిశ్రమకు అవసరమైన స్టీరింగ్‌ నకుల్‌ను ఇక్కడ తయారు చేస్తారు.
  • డిజిటల్ సేవలను విస్తరణ, ఓటీటీ సేవలతో నేరుగా ఇంట్లోనే సినిమాలు చూసే వీలు కల్పించడం సహా మరిన్ని ప్రకటనలు చేసేందుకు అవకాశాలున్నాయి.

ఇవీ చూడండి:

విదేశీ స్టాక్​ ఎక్స్ఛేంజీల్లో జియో లిస్టింగ్​!

జియో​లో గూగుల్ రూ.30 వేల కోట్ల పెట్టుబడి!

ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానానికి ముకేశ్‌!

Last Updated : Jul 15, 2020, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details