ఆఫ్టికల్ ఫైబర్ ఆధారిత జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను రిలయన్స్ జియో ప్రారంభించింది. ఇందులో వివిధ ప్లాన్లను జియో ప్రకటించింది. కనీస ప్లాన్ ధర రూ.699, గరిష్ఠ ప్లాన్ ధర రూ. 8499గా నిర్ణయించింది.
6 ప్లాన్లతో జియో ఫైబర్ సేవలు ప్రారంభం - డీటీహెచ్
జియో నుంచి బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ సేవలు వచ్చేశాయి. రిలయన్స్ జియో ఫైబర్ అధికారికంగా ప్రారంభమైంది. 6 రకాల ప్లాన్ల వివరాలన్ని సంస్థ వెల్లడించింది. రూ. 699తో కనీస ప్లాన్ మొదలవుతుంది.
నెలకు రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ వరకు డేటా పొందవచ్చు. అదనంగా మరో 50 జీబీ డేటా లభిస్తుంది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు ఇచ్చే ల్యాండ్‌లైన్ ఫోన్‌తో భారత్‌లో ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ సదుపాయాలు కూడా ఉచితంగా పొందవచ్చు.
నెలకు రూ.8499 ప్లాన్ తీసుకుంటే వన్ జీబీపీఎస్ వేగంతో 5 వేల జీబీ వరకు డేటా లభిస్తుంది. ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఉచితంగా సెట్‌టాప్ బాక్స్‌ను అందిస్తారు. నెలకు రూ.1299 అంతకంటే ఎక్కువ ప్లాన్‌ను ఏడాది పాటు తీసుకుంటే టీవీ సెట్ ఉచితంగా లభిస్తుంది.
- ఇదీ చూడండి: 'జియో ఫైబర్'తో నట్టింట్లోనే అద్భుతాలు!