తెలంగాణ

telangana

ETV Bharat / business

అంబానీ పేరుకు అర్థం తెలిస్తే షాక్​ అవుతారు! - అంబానీ పేరుకు అర్థ తెలిపే వార్తలు

అంబానీ అంటే తెలియనివారు ఉండరు. భారత్​లోని అపర కుబేరుల్లో తొలిస్థానం ఆయనది. అంబానీ అంటే డబ్బు, డబ్బు అంటే అంబానీ అనేంతగా ప్రాచుర్యం పొందిన పేరు. ఇది కేవలం నోటి మాట కాదు, నిజ్జంగా నిజమని చెబుతోంది గూగుల్​.

అంబానీ పేరుకు అర్థం తెలిస్తే షాక్​ అవుతారు!

By

Published : Oct 12, 2019, 3:21 PM IST

ముకేశ్​ అంబానీ... రిలయన్స్​ గ్రూప్​ అధిపతి. భారత్​లో అత్యంత సంపన్నుడు. దేశంలో దాదాపు అందరికీ సుపరిచితులు. ప్రతి ఒక్కరూ ఆయన వ్యాపార సంస్థల సేవల్ని ఏదో ఒక రూపంలో పొందుతున్నవారే.

డబ్బు సంపాదించడం గురించి కాస్త గొప్పగా చెప్పాల్సిన సందర్భం ఎప్పుడు వచ్చినా.. అంబానీ పేరు వాడతారు. 'నేనే అంబానీ' టైటిల్​తో సినిమా కూడా వచ్చింది. సంపాదనకు అలా పర్యాయపదంగా మారారు అంబానీ.

డబ్బుకు పర్యాయపదం మాత్రమే కాదు.. ఏకంగా అర్థమే అంబానీ అంటోంది గూగుల్. అదెలాగో తెలుసుకోవాలంటే గూగుల్​ ట్రాన్స్​లేట్​కు వెళ్లండి. 'అంబానీ' పదాన్ని రొమేనియా నుంచి ఆంగ్లంలోకి అనువదించండి. అప్పుడు ఆ పదానికి అర్థం... 'నా వద్ద డబ్బు ఉంది (ఐ హ్యావ్​ మనీ)' అని వస్తుంది.

గూగుల్​ ట్రాన్స్​లెటర్​

చూశారా... అంబానీ అంటే డబ్బేనని నిరూపితమైంది!

ఇదీ చూడండి: పాపాల పాకిస్థాన్​కు ఎఫ్​ఏటీఎఫ్​ 'బ్లాక్​లిస్ట్'​ ముప్పు!

ABOUT THE AUTHOR

...view details