తెలంగాణ

telangana

ETV Bharat / business

శక్తిమంతమైన సీఈఓ జాబితాలో ముకేశ్​ అంబానీ - రిలయన్స్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన సీఈఓల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చోటు సంపాదించారు. 121 మందిలో 49వ స్థానంలో నిలిచారు. మొత్తం జాబితాలో 10 మంది భారతీయులకు చోటు దక్కింది.

ముకేశ్​ అంబానీ

By

Published : Jul 29, 2019, 8:13 PM IST

ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన 121 మంది ముఖ్య కార్య నిర్వహణ అధికారులతో 'సీఈఓ వరల్డ్' జాబితాను వెలువరించింది. ఇందులో భారతీయులు 10 మంది చోటు సంపాదించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ సీఈఓ సంజీవ్‌సింగ్‌, ఓన్​ఎన్​జీసీ అధ్యక్షుడు శశిశేఖర్‌ ఆ 10మందిలో ఉన్నారు.

ఈ జాబితాలో ముకేశ్ అంబానీ 49, సంజీవ్‌సింగ్‌ 69, శశిశేఖర్‌ 77వ ర్యాంకుల్లో నిలిచారు. నిజానికి ఈ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఆర్సెలర్ ​మిత్తల్​ ఛైర్మన్​ అండ్​ సీఈఓ లక్ష్మీ మిత్తల్‌. ఈయన భారతీయుడే అయినప్పటికీ ఆయన కంపెనీ లగ్జంబర్గ్‌లో నమోదైంది. అందువల్ల మిత్తల్​ పేరు భారతీయుల జాబితాలో పొందుపరచలేదు.

ఈ 121 మంది జాబితాలో ఎస్​బీఐ, టాటా మోటర్స్‌, బీపీసీఎల్‌, టీసీఎస్ సహా మరికొన్ని భారతీయ సంస్థల సీఈఓలు కూడా ఉన్నారు.

మొదటి స్థానంలో..

వాల్‌మార్ట్ సీఈఓ డగ్లస్ మెక్‌ మిలన్ ప్రథమ ర్యాంకు సాధించారు. రాయల్ డచ్ షెల్స్ సీఈఓ బెన్ వాన్ బ్యూర్డెన్‌ 2, సౌదీ అరమ్‌కో సీఈఓ అమిన్ హెచ్​ నజీర్‌ నాలుగో ర్యాంకు సాధించారు. యాపిల్ సీఈఓ టిమ్‌ కుక్‌, బెర్క్‌ షైర్ సీఈఓ వారెన్ బఫెట్‌, అమెజాన్ సీఈఓ జెఫ్‌ బెజోస్ వరుసగా 9, 10, 11 ర్యాంకుల్లో నిలిచారు.

ఇదీ చూడండి: 'ఉల్లంఘన' కేసులో అనిల్​ అంబానీకి ఊరట

ABOUT THE AUTHOR

...view details