తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్ 3 నెలల ఆదాయం రూ.8 లక్షల కోట్లు! - 2021 తొలి మూడు నెలల్లో అమెజాన్ లాభం

కొవిడ్ సంక్షోభంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​కు లాభాల పంట పండింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 8.1 బిలియన్ డాలర్ల లాభాన్ని గడించినట్లు అమెజాన్ ప్రకటించింది.

Amazon revenue grow in record level
రికార్డు స్థాయిలో పెరిగిన అమెజాన్ ఆదాయం

By

Published : Apr 30, 2021, 5:03 PM IST

కరోనా మహమ్మారి చాలా కంపెనీలను సంక్షోభంలో పడేసింది. అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ విషయంలో మాత్రం ఇది పూర్తి విరుద్దం. ఎందుకంటే కొవిడ్ సంక్షోభం అమెజాన్​కు రికార్డు స్థాయి లాభాలను తెచ్చిపెడుతోంది.

మూడింతలు పెరిగిన లాభం..

ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 8.1 (దాదాపు రూ.60 వేల కోట్లు) బిలియన్​ డాలర్ల లాభాన్ని గడించినట్లు అమెజాన్ తాజాగా ప్రకటించింది. 2020 ఇదే సమయంతో(2.5 బిలియన్ డాలర్లు) పోలిస్తే ఈ మొత్తం దాదాపు మూడింతలు ఎక్కువ.

2021 తొలి మూడు నెలల్లో ఆదాయం ఏకంగా 108.5 బిలియన్ డాలర్లు (రూ.8 లక్షల కోట్ల పైమాటే)గా నమోదైనట్లు వెల్లడించింది అమెజాన్. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 44 శాతం అధికం. ఆదాయం 100 బిలియన్​ డాలర్ల మార్క్ దాటడం ఇది వరుసగా రెండో త్రైమాసికం.

కరోనా నేపథ్యంలో ఆన్​లైన్ షాపింగ్​ ఎక్కువగా జరుగుతుండటం ఈ స్థాయి లాభాలకు కారణంగా తెలిపింది అమెజాన్.

ఇదీ చదవండి:క్యూ1లో శాంసంగ్​కు భారీ లాభాలు

ABOUT THE AUTHOR

...view details