తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్‌ ఉద్యోగులకు రూ.3వేల కోట్ల బోనస్‌

అమెజాన్​ తన ఉద్యోగులకు.. ఏకకాల బోనస్​లు అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా సంక్షోభంలోనూ పనిచేస్తున్న వారికి ఈ ప్రయోజనాలు అందుతాయని సంస్థ స్పష్టం చేసింది. ఇందుకోసం దాదాపు 500 మిలియన్​ డాలర్లు ఖర్చుచేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

By

Published : Jul 1, 2020, 8:15 AM IST

amazon-to-pay-500-dollars-million-in-one-time-bonuses-to-front-line-workers
అమెజాన్‌ ఉద్యోగులకు రూ.3వేల కోట్ల బోనస్‌

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. కరోనా వైరస్‌ సంక్షోభంలోనూ పనిచేస్తున్న ముందు వరుస ఉద్యోగులకు ఏకకాల బోనస్‌లు అందజేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 500 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3,775 కోట్లు) ఖర్చుచేస్తామని వెల్లడించింది.

జూన్‌ వరకు పనిచేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఒక్కొక్కరు 150 డాలర్లు (రూ11,300) నుంచి 3000 డాలర్లు (రూ.2.26 లక్షలు) ఏకకాల బోనస్‌గా అందుకుంటారని అమెజాన్‌ తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ ఏటా 10 బిలియన్‌ వస్తువులను వినియోగదారుల వద్దకు చేరుస్తుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రబలడంతో అమెజాన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సంస్థ తన ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకుంటుందా, భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్ల వినియోగం, ఆరోగ్య తనిఖీలు చేపడుతోందా లేదా అని అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టింది. అయితే.. మహమ్మారి సమయంలో ఎక్కువమంది తమ అవసరాల కోసం ఈ కామర్స్‌ సంస్థలపైనే ఆధారపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details