తెలంగాణ

telangana

ETV Bharat / business

పండుగ సీజన్ సేల్​కు అమెజాన్ రెడీ - అమెజాన్ లేటెస్ట్ ఆఫర్లు

పండుగ సీజన్​ సేల్​కు సిద్ధమైంది ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా. ఈ నెల 17 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. ప్రైమ్ మెంబర్​షిప్ ఉన్నవాళ్లు ఒక రోజు ముందు నుంచే సేల్​లో.. కొనుగోళ్లు జరపొచ్చని వెల్లడించింది.

AMAZON GREAT INDIA SALE DATE
అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ ఆఫర్లు

By

Published : Oct 6, 2020, 2:45 PM IST

దసరా, దీపావళి పండుగ సీజన్‌ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను ప్రకటించింది. అక్టోబరు 17న ఈ ప్రత్యేక సేల్‌ ప్రారంభం కానుంది. అయితే, ఎప్పటివరకు ఈ సేల్​ కొనసాగుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో భాగంగా అమెజాన్‌లో వస్తువులు కొనుగోలు చేసేవారు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌/క్రెడిట్‌ కార్డును ఉపయోగించి 10శాతం రాయితీ పొందవచ్చు. షరతులకు లోబడి ఈఎంఐలపై కూడా ఇది వర్తిస్తుంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న వారు 24గంటల ముందు నుంచే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు.

ప్రత్యేక రాయితీలు..

అక్టోబరు 14న విడుదల చేసే వన్‌ప్లస్‌ 8టీ 5జీ ఫోన్‌, అక్టోబరు 15న తీసుకురానున్న అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ లైట్‌ను ఈ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో అమ్మకానికి తీసుకురానున్నారు. వీటితో మొబైల్‌ ఫోన్లు, గృహోపకరణాలు, నిత్యావసర సరకులు, దుస్తులు, పుస్తకాలు, పిల్లల బొమ్మలపై కూడా రాయితీలు లభించనున్నాయి.

బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ డెబిట్‌/క్రెడిట్‌ కార్డుపై వడ్డీ రహిత వాయిదాల్లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో అమెజాన్‌ యాప్‌లో రాత్రి 8గంటల నుంచి అర్ధరాత్రి వరకు సాగే గోల్డెన్‌ అవర్స్‌లో మరికొన్ని వస్తువులపై నిబంధనల మేరకు ప్రత్యేక రాయితీ లభించనుంది.

ఇదీ చూడండి:16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' సేల్‌

ABOUT THE AUTHOR

...view details