భారత్‌లో విండోస్ 10 యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ యాప్‌ను విడుదల చేసింది. ఇకపై విండోస్ 10 వాడే డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ యూజర్లు కొత్త యాప్ ద్వారా వీడియో స్టీమింగ్ అనుభూతి పొందొవచ్చని అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది.
విండోస్ 10 యూజర్లకు అమెజాన్ ప్రైమ్ యాప్ - విండోస్ కోసం అమెజాన్ ప్రైమ్ యాప్
వీడియో స్టీమింగ్ కోసం విండోస్ 10 యూజర్లకు యాప్‌ను ఆవిష్కరించింది అమెజాన్ ప్రైమ్. మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
విండోస్‌లో ఇక ప్రైమ్ వీడియో యాప్
ఈ యాప్‌ను మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. వీడియో కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌లోకి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం 10 ఓఎస్‌లో మాత్రమే ఉండనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. వెబ్సైట్లో ఎప్పటిలానే స్టీమింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:ఆ విమాన సంస్థలో 7,500 ఉద్యోగాల కోత