ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ ఫార్మా రంగంలోనూ ప్రవేశించింది. తన మొదటి ఆన్లైన్ ఫార్మసీ స్టోర్‌ను న్యూయార్క్‌లో ప్రారంభించింది. మరికొన్ని రోజుల్లో ఆన్లైన్ ద్వారా ఔషధాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించనుంది అమెజాన్.
ఇప్పటికే అన్ని రంగాల్లో పాగా వేసిన అమెజాన్.. ఇక ఔషధ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించేందుకే అమెజాన్ ఇందులోకి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతిపెద్ద సరఫరా వ్యవస్థలైన సీవీఎస్, వాల్‌గ్రీన్స్.. స్థిర కొనుగోళ్లు జరిగేందుకు వాళ్ల ఫార్మసీలపైనే పనిచేస్తాయి.