ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో సుమారు 20 వేల తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు ఆదివారం పేర్కొంది. వీరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అవసరమైన సేవలు అందించనుంది.
వారి అవసరాలు తీర్చడమే..
తాత్కాలిక ఉద్యోగులతో రానున్న ఆరునెలలపాటు వినియోగదారుల అవసరాలు తీర్చడంలో ఇబ్బంది ఉండదని అమెజాన్ ఇండియా డైరెక్టర్(వినియోగ దారుల సేవా విభాగం) అక్షయ్‌ప్రభు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు మరో పది నగరాల్లో ఉన్న తమ సంస్థ అనుబంధ కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.