భాగస్వామ్య సంస్థలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ప్రకటించింది. ముఖ్యంగా తమపైనే ఎక్కువగా ఆధారపడిన చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు (ఎస్ఎంబీ) అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
దేశవ్యాప్త లాక్డౌన్తో చాలా ఎస్ఎంబీలు ఆర్థికంగా బలహీనపడ్డాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది. అందుకే డెలివరీ, ఎంపిక చేసిన రవాణా విభాగ భాగస్వామ్య వ్యాపారులకు ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఏకమొత్తంలో ఆర్థిక సహాయం ఆయా వ్యాపారులకు అనేక విధాలుగా తోడ్పడుతుందని అభిప్రాయపడింది అమెజాన్ ఇండియా. ఎస్ఎంబీల్లోని దాదాపు 40 వేల మందికి ఉద్యోగులకు దీని ద్వారా మేలు జరుగుతుందని పేర్కొంది.