తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ 6 రోజుల అమ్మకాలు ఎంతో తెలుసా...?

పండుగ సీజన్​లో భారీ ఆఫర్లను ప్రకటించిన ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​... ఆరు రోజుల్లో భారీగా అమ్మకాలు జరిపాయి. సెప్టెంబర్​ 24-అక్టోబర్​ 4 మధ్య సుమారు రూ. 19,000 కోట్ల వ్యాపారం చేశాయి.

By

Published : Oct 10, 2019, 5:16 AM IST

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ 6 రోజుల అమ్మకాలు ఎంతో తెలుసా...?

ఈ-కామర్స్​ దిగ్గజాలు ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లు పండుగ సీజన్​లో అమ్మకాల్లో తారాజువ్వల్లా దూసుకెళ్లాయి. ఫ్లిప్​కార్ట్​- బిగ్​ బిలియన్​ డేస్​, అమెజాన్-​ గ్రేట్​ ఇండియా ఫెస్టివల్​ ఆఫర్లు సెప్టెంబర్​ 29 నుంచి ఈనెల 4వరకు కొనసాగాయి. ఈ ఆరు రోజుల మొత్తం మార్కెట్​ విలువలో 90 శాతంతో రూ.19,000 కోట్ల అమ్మకాలు ఈ రెండు సంస్థలు చేపట్టినట్లు బెంగళూరుకు చెందిన పరిశోధన సంస్థ రెడ్​సీర్​ కన్సల్టెన్సీ ప్రకటించింది.

63 శాతంతో ఫ్లిప్​కార్ట్​ టాప్​..

విక్రయాల సీజన్​లో 60-62 శాతం స్థూల జీఎమ్​వీ షేర్​ వాటాతో ఫ్లిప్​కార్ట్​ పండుగ అమ్మకాలకు నాయకత్వం వహించినట్లు నివేదిక పేర్కొంది. అనుబంధ గ్రూపులు మింత్రా, జబాంగ్​లను కలిపితే అది దాదాపు 63 శాతం వాటా ఉంటుందని లెక్కగట్టింది. అధికంగా మొబైల్​ ఫోన్ల అమ్మకాలతో ఫ్లిప్​కార్ట్​ అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది. జీఎంవీ వాటాలో అమెజాన్​ 22 శాతం వృద్ధి నమోదుచేసినట్లు తెలిపింది.

రెడ్​సీర్​ నివేదిక ప్రకారం ఇయర్​ ఆన్​ ఇయర్​ (వైఓవై) వృద్ధి పండుగ సీజన్​లో 30 శాతంగా ఉంది.

రికార్డు స్థాయిలో..

ఇప్పటికే అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ సంస్థలు రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగినట్లు ప్రకటించాయి. ప్రత్యేక సీజన్​లో టైర్​-2, టైర్​-3 నగరాల్లో కొత్త కస్టమర్లను ఆకర్షించటంలో సఫలమైనట్లు పేర్కొన్నాయి. ఎలక్ట్రానిక్స్​, స్మార్ట్​ఫోన్లు, ఫ్యాషన్​, భారీ గృహోపకరణాలు వంటివి విక్రయాల్లో తొలి స్థానంలో ఉన్నాయని తెలిపాయి ఈ-కామర్స్​ సంస్థలు.

నమ్మదగినట్లు లేదు..

జీఎంవీ వాటాలో అమెజాన్​ 22 శాతం నమోదైనట్లు పేర్కొన్న రెడ్​సీర్​ నివేదికను తప్పుపట్టారు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు. నమ్మలేని విధంగా ఉన్న నివేదికలపై తాము మాట్లడమని పేర్కొన్నారు. పండుగ సీజన్​లో అమెజాన్​ వినియోగదారుల లావాదేవీల్లో అత్యధికంగా 51శాతం, ఆర్డర్​ వాటా 42 శాతం, దేశంలోని అన్ని మార్కెట్లలో 45 శాతం వాటాతో నిలిచినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:పసిడి ధరలు మళ్లీ పరుగు- ప్రస్తుత ధర ఎంతంటే...

ABOUT THE AUTHOR

...view details