ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడం వల్ల ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు కొంత వెసులుబాలు కల్పించింది. తమ సంస్థకు చెందిన కార్పొరేట్ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోంను పొడిగించింది. అమెరికా వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో.. తమ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.
వర్క్‌ఫ్రం హోంకు అవకాశం ఉన్నవారు జూన్ 30, 2021 వరకు దీనిని వినియోగించుకోవాలని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలోని ఈ సంస్థ ఉద్యోగుల్లో 19,000 మందికి కొవిడ్ సోకిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. కరోనా కాలంలో కూడా గోదాములను తీసి ఉద్యోగులను ప్రమాదంలోకి నెట్టిందని అమెజాన్‌పై విమర్శలు కూడా ఎదుర్కొంది.