ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ మరో ఘనత సాధించింది. ఇంటర్నెట్ సంచలనం గూగుల్‌ను దాటేసి అత్యంత విలువైన బ్రాండ్‌గా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ మార్కెట్ పరిశోధక సంస్థ 'కంటార్' విడుదల చేసిన '100 టాప్ బ్రాండ్స్-2019' జాబితాలో యాపిల్, గూగుల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మొదటి స్థానంలో ఉన్న గూగుల్‌ను మూడో స్థానానికి నెట్టింది అమెజాన్. యాపిల్ మాత్రం తన రెండో స్థానాన్ని పదిలపరుచుకుంది. గతేడాదితో పోలిస్తే 52 శాతం పెరిగిన అమెజాన్ బ్రాండ్ విలువ 315 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
మొదటి 8 స్థానాల్లో...
- అమెజాన్ - 315 బిలియన్ డాలర్లు
- యాపిల్ - 309.5 బిలియన్ డాలర్లు
- గూగుల్ - 309 బిలియన్ డాలర్లు
- మైక్రోసాఫ్ట్- 251 బిలియన్ డాలర్లు
- వీసా- 178 బిలియన్ డాలర్లు
- ఫేస్బుక్ - 159 బిలియన్ డాలర్లు
- అలీబాబా - 131.2 బిలియన్ డాలర్లు
- టెన్సెంట్- 130.9బిలియన్ డాలర్లు