అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ మధ్య పెట్టుబడులకు (Amazon Future Retail) సంబంధించి గత కొన్ని నెలలుగా సాగుతున్న వివాదానికి తెరపడనుందా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ రిటైల్ మధ్య కుదిరిన రూ.24,713 కోట్ల ఒప్పందంపై (Amazon Future Retail) అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. 2019 పెట్టుబడుల ఒప్పందాన్ని ఫ్యూచర్ గ్రూప్ ఉల్లంఘించిందనేది అమెజాన్ సంస్థ ఆరోపణ.
అయితే అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధుల మధ్య (Amazon Future Retail) కొన్ని వారాల కిందట జరిగిన కీలక సమావేశంలో ఇరు వర్గాలు వివాదం ముగించడానికి మొగ్గుచూపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్ కిశోర్ బియానీ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించినట్లు తమపై ఆరోపణలు చేస్తూ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వద్ద దాఖలు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాల్సిందిగా ఫ్యూచర్ గ్రూప్‌ను అమెజాన్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోర్టు బయట సెటిల్‌మెంట్‌కు అమెజాన్ ఈ రూపేణ సంకేతాలు ఇచ్చిందని చెబుతున్నారు.