తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎదురులేని ఆల్టో- వరుసగా 16వ సారి నెంబర్​-1

చిన్న కార్లలో అత్యంత ఆదరణ కలిగిన మారుతి ఆల్టో.. విక్రయాల్లో వరుసగా 16వ ఏడాది మొదటి స్థానంలో నిలిచిందని మారుతీ సుజుకీ తెలిపింది. 2019-20 మధ్యకాలంలో 1.48లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది.

Alto becomes best-selling model for 16th straight year: Maruti
ఎదురలేని ఆల్టో.. వరుసగా 16వ సారి నెంబర్​-1

By

Published : Jun 15, 2020, 6:06 PM IST

ప్రముఖ ఆటోమొబైల్‌ ఉత్పత్తుల సంస్థ మారుతీ సుజుకీకి చెందిన ఆల్టో కారు వరుసగా 16 ఏడాది బెస్ట్ సెల్లింగ్​ కారుగా నిలిచిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. చిన్న కార్లలో అత్యంత ఆదరణ గల ఆల్టోను 2019-20 మధ్యకాలంలో 1.48 లక్షల మంది కొనుగోలు చేసినట్లు తెలిపింది.

ఆల్టోను 2000 సంవత్సరంలో మార్కెట్​లోకి తీసుకొచ్చారు. 2004లో మొదటిసారి బెస్ట్​ సెల్లింగ్​​ కారుగా నిలిచింది. అప్పటి నుంచి మార్కెట్​లో తిరుగులేకుండా పోయింది.

ఆల్టోకు బలమైన కస్టమర్​ బేస్​ ఉందని, ఎప్పటికప్పుడు అప్​గ్రేడ్​ చేస్తుండటం, సరికొత్త హంగులు జోడించడం వల్లే మంచి ఆదరణ లభిస్తోందని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్​ అండ్ సేల్స్​) శశాంక్​ శ్రీవాస్తవ అన్నారు.

"కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుత ఆల్టో మోడల్​లో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్​ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ సహా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాం. కస్టమర్ల ప్రాధాన్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నాం"

-శశాంక్​ శ్రీవాస్తవ, మారుతీ సుజుకీ ఇండియా ఈడీ

ఇదీ చూడండి: 'మే'లో దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం.. -3.21 శాతంగా నమోదు

ABOUT THE AUTHOR

...view details