తమ బ్యాంకులో విలీనమైన లక్షీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) వినియోగదార్లు అన్ని బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చని డీబీఎస్ బ్యాంక్ ఇండియా వెల్లడించింది. అదే సమయంలో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ప్రస్తుతానికి మార్పులేమీ లేవని స్పష్టం చేసింది. ప్రభుత్వం, ఆర్బీఐకి ఉన్న ప్రత్యేకాధికారాల కింద డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో ఎల్వీబీ విలీనం నవంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చింది.
"తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు వడ్డీ రేట్లలో మార్పులు ఉండవు. అదే విధంగా ఎల్వీబీ సర్వీసు షరతులు, నిబంధనల కిందే ఎల్వీబీ ఉద్యోగులు కొనసాగుతారు. ఇప్పుడు వారంతా డీబీఎస్ బ్యాంక్ ఇండియా ఉద్యోగులయ్యారు."