తెలంగాణ

telangana

ETV Bharat / business

'అలీబాబా' ఛైర్మన్ పదవికి జాక్​ మా వీడ్కోలు

అలీబాబా ఛైర్మన్​ పదవి నుంచి జాక్​ మా రిటైర్​మెంట్ తీసుకున్నారు. తన 55వ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు జాక్​ మా. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఈయన.. చైనాలో అత్యంత సంపన్నుడు.

జాక్​ మా

By

Published : Sep 10, 2019, 1:28 PM IST

Updated : Sep 30, 2019, 2:57 AM IST

చైనీస్‌ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్​ మా.. తన ఛైర్మన్​ పదవి నుంచి తప్పుకున్నారు. గతేడాది ప్రకటించినట్లుగానే 55వ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. అమెరికాతో వాణిజ్యం యుద్ధం కారణంగా చైనా పరిశ్రమల్లో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో జాక్​ మా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ.. ‘అలీబాబా పార్ట్‌నర్‌షిప్‌’ గ్రూప్‌లో సభ్యుడిగా కొనసాగనున్నారు జాక్​. 36 మంది సభ్యులతో కూడిన ఈ గ్రూప్​నకు కంపెనీ డైరెక్టర్లలో మెజార్టీ సభ్యులను నామినేట్‌ చేసే హక్కు ఉంటుంది.

టీచర్​ నుంచి బిలియనీర్​గా..

వృత్తిరీత్య ఇంగ్లీష్ ఉపాధ్యాయుడైన అయిన జాక్‌ మా.. 1999లో ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టి అలీబాబాను స్థాపించారు. తక్కువ కాలంలోనే ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెంది బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. 2013లో సీఈఓ పదవి నుంచి జాక్‌ మా తప్పుకున్నారు. అప్పటి నుంచి ఛైర్మన్‌గా కొనసాగిన ఆయన.. నేడు ఆ హోదా నుంచీ వైదొలిగారు. ప్రపంచ అపర సంపన్నుల్లో ఒకరైన జాక్‌ మా సంపద ప్రస్తుతం 41.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

గత ఏడాదే రిటైర్​మెంట్ ప్రకటన!

తొలుత.. 2018 సెప్టెంబర్​ 10న తన 54వ పుట్టినరోజునే పదవీ విరమణ చేస్తానని వెల్లడించారు జాక్​. అయితే సంస్థ అవసరాల రీత్యా మరో ఏడాది పాటు ఛైర్మన్‌గా కొనసాగాలని కంపెనీ బోర్డు సభ్యులు కోరారు. ఈ నేపథ్యంలో మరో ఏడాది ఛైర్మన్​ పదవిలో ఉన్నారు జాక్​ మా.

ఇదీ చూడండి: కిరాణా దుకాణాలతో జట్టుకట్టనున్న ఫ్లిప్​కార్ట్

Last Updated : Sep 30, 2019, 2:57 AM IST

ABOUT THE AUTHOR

...view details