తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోతో పోరుకు ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ రె'ఢీ​'..! - ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ న్యూస్​

ప్రపంచాన్ని కళ్ల ముందుంచేందుకు రిలయన్స్​ సంస్థ.. బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్​, టీవీ వంటివి ఒకే ప్యాకేజీలో ఇస్తోంది. ఈ ప్రకటనతో మిగిలిన నెట్​వర్క్​లు బెంబేలెత్తిపోయాయి. జియో గిగాఫైబర్​ను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీ ఎయిర్​టెల్​ 'ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ ఫైబర్​'​ ద్వారా స్మార్ట్​ హోమ్స్​​ సొల్యూషన్స్​ను తీసుకొస్తుంది. త్వరలో జరగనున్న ఇండియా మొబైల్​ కాంగ్రెస్ ​(ఐఎంసీ)-2019 కార్యక్రమంలో దీనిని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.

జియోతో పోరుకు ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ రె'ఢీ​'..!

By

Published : Oct 12, 2019, 4:05 PM IST

భారత టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన జియో... గిగాఫైబర్ ప్రకటనతో ఇతర నెట్​వర్క్​లకు పెద్ద సవాల్​ విసిరింది. ఈ​ పోటీని తట్టుకునేందుకు ఇతర టెలికాం సంస్థలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. గిగాఫైబర్​ ధాటికి తేలిపోకుండా ఉండేందుకు భారతీ ఎయిర్​టెల్​ 'ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ ఫైబర్​' తీసుకొచ్చింది. దీని ద్వారా డీటీహెచ్, బ్రాడ్​బ్యాండ్​, టీవీ వంటి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది.

సంప్రదాయ వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు, ఇతర వినియోగదారులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఎక్స్​ట్రీమ్​ ఫైబర్​ను మరింత ప్రభావవంతంగా చేసేందుకు ఐఓటీ సొల్యూషన్స్​ అందించేందుకు కసరత్తు చేస్తోంది.

త్వరలో జరగబోయే ఇండియా మొబైల్​ కాంగ్రెస్​ (ఐఎంసీ)-2019 కార్యక్రమంలో టెలికాం ఆపరేటర్లు.. నూతన ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా భారతీ ఎయిర్​టెల్​ లైవ్-5జీ నెట్​వర్క్​పై డెమోను ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. దానితో పాటు స్మార్ట్​ బిజినెస్​, స్మార్ట్​ సిటీస్​ ప్రాజెక్ట్​ వంటివి ప్రదర్శించనుంది.

ఎయిర్​టెల్​ ప్రదర్శించే 5జీ సాంకేతికతలో లైసెన్స్​డ్​ అసిస్టెడ్​ యాక్సెస్​ (ఎల్​ఏఏ), డిజిటల్​ ఇండియాలో ఏ విధంగా భాగస్వాములు అవుతారనే అంశాలు ఉండనున్నాయి. 'ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ ' కింద తీసుకురానున్న స్మార్ట్​ హోమ్స్​​ సొల్యూషన్స్​ను అందించేందుకు ఐఓటీ సొల్యూషన్స్​పై పనిచేస్తున్నట్లు తెలిపింది. మరింత శక్తిమంతంగా పనిచేసే దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ అనేది సంస్థ స్మార్ట్​ హోమ్స్​​ సొల్యూషన్​లోని భాగం​. బ్రాడ్​ బ్యాండ్​, డీటీహెచ్​, టీవీ వంటివి ఒకే దానిలో అందిస్తోంది. స్మార్ట్​ హోమ్​ కోసం ఐఓటీ సేవలను ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ ద్వారా తీసుకురానుంది.

5జీ నెట్​వర్క్​..

ప్రస్తుతం దేశంలో 4జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2020 అర్ధభాగంలో లేక 2021 ప్రారంభంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలో ప్రభుత్వం నిర్వహించే 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రస్తుతం రిలయన్స్​ జియో సహా దాదాపు అన్ని సంస్థలు వ్యతిరేకంగా ఉన్నాయి. స్పెక్ట్రం కేటాయింపులు జరిగే వరకు, టెలికాం సంస్థలు దేశంలో 5జీ సేవలను ప్రారంభించలేవు.

స్మార్ట్​ సిటీస్​ ప్రాజెక్ట్​...

భారతీ ఎయిర్​టెల్​ ఇప్పటికే స్మార్ట్​ సిటీస్​ ప్రాజెక్ట్​పై పనిచేస్తోంది. హరియాణాలోని ఫరీదాబాద్​లో స్మార్ట్​ సిటీ సొల్యూషన్స్​ను ప్రారంభించింది. ఇందులో ట్రాఫిక్​ నియంత్రణ వ్యవస్థ, నగరవ్యాప్తంగా నిఘా, కాలుష్య తనిఖీ, ట్రాఫిక్​ అమలు వ్యవస్థ, వీధి దీపాలు, స్మార్ట్​ సిగ్నల్​ విధానాలు ఉన్నాయి. ఇందులోని కొన్నింటిని ఐఎంసీ-2019లో ప్రదర్శించనుంది ఎయిర్​టెల్​. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.

కనెక్టెడ్​ వాహనాలు​..

నెట్​వర్క్​కు అనుసంధానమైన వాహనాలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది ఎయిర్​టెల్​. భారత్​లో మొట్టమొదటి ఇంటర్​నెట్​ కార్​-ఎంజీ హెక్టార్​ను తీసుకొచ్చింది. భవిష్యత్తు తరం ద్విచక్రవాహనాలు, కార్లను శక్తిమంతం చేయడానికి ఇతర ఆటోమోటివ్​ ఓఈఎంలతో పనిచేస్తోంది.

ఇదీ చూడండి: ట్రాఫిక్​ చలానా రాశారని రోడ్డుపై ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details