జియో వచ్చాక టెలికాం రంగంలో పోటీ బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించడం సాధారణం. అదే బాటలో ఎయిర్టెల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపర్ బొనాంజా ప్రకటించింది. కొత్తగా 4జీ సిమ్‌ను తీసుకున్న, 4జీ డివైస్‌కు అప్‌గ్రేడ్ అయిన వినియోగదారులకు 11 జీబీ వరకు డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది. ఈ ఆఫర్ ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది.
కొత్త వినియోగదారుడైతే..
ఎయిర్టెల్ అందించే 11జీబీ డేటాను రెండు విడతల్లో పొందే అవకాశం ఉంది. అందులో మొదటిది.. కొత్తగా ఎయిర్టెల్ 4జీ కస్టమర్ 'ఎయిర్టెల్ థ్యాంక్స్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే 5జీబీ డేటా వస్తుంది. అయితే ఈ డేటా మొత్తం ఐదు 1జీబీ కూపన్ల రూపంలో మూడు రోజుల వ్యవధిలో యాప్‌లో క్రెడిట్ అవుతుంది. కొత్త మొబైల్ నంబర్ యాక్టివేట్ అయిన నెల రోజుల్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఐదు కూపన్లు వస్తే.. యాప్‌లోని 'మై కూపన్స్' సెక్షన్‌కు వెళ్లి వాటిని క్లెయిమ్ చేసుకోవాలి. అయితే 1జీబీ డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్ అయిన 90 రోజుల్లోగా రీడిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. 'ఎయిర్టెల్ థ్యాంక్స్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకపోతే 5జీబీ డేటాకు బదులు 2జీబీ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది.