ఆర్థికంగా కుదేలయిన జెట్ ఎయిర్వేస్కు చేయూతనిచ్చేందుకు ఎయిర్ ఇండియా ప్రయత్నిస్తోంది. జెట్‌కు చెందిన ఐదు బోయింగ్ 777 విమానాలను లీజుకు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్‌కు ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశ్వని లోహని లేఖ రాశారు.
అన్ని రకాల విమాన సర్వీసులను జెట్ సంస్థ నిలిపివేసింది. జెట్ శ్రేణిలో భారీ విమానాలు చాలానే ఉన్నాయి. ఇందులో బోయింగ్ 777-300 ఈఆర్, ఎయిర్‌బస్ ఏ330 ఉన్నాయి. ఈ విమానాలను జెట్ సంస్థ ఉపయోగించిన సర్వీసుల ప్రకారమే లండన్, దుబాయి, సింగపూర్‌కు వాడనున్నట్టు తెలుస్తోంది.
ప్రయాణికులకు ఊరట
జెట్‌లో ముందస్తు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు తీపి కబురును అందించింది ఎయిర్ ఇండియా. జెట్ సర్వీసుల రద్దు కారణంగా ముందుగా బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీరిలో అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రత్యేక ధరలను అందుబాటులోకి తెస్తామని ఎయిర్ఇండియా ప్రకటించింది.