కరోనా ప్రభావం ఎయిర్ఏసియా పైలట్లపై పడింది. మే, జూన్ నెలల్లో పైలట్ల జీతాల్లో 40 శాతం కోత విధించింది సంస్థ. అయితే సీనియర్ మేనేజర్లు సహా మిగతా ఉద్యోగులకు ఏప్రిల్ నెలలో ఇచ్చిన వేతనాలనే అందించింది. సీనియర్ మేనేజర్లకు ఏప్రిల్ నెల జీతాల్లో 20 శాతం కోత విధించిన సంస్థ.. ఇతర ఉద్యోగులకు 7నుంచి 17 శాతం కోత విధించింది. అయితే నెలకు రూ. 50,000 అంతకంటే తక్కువ జీతాలను పొందుతున్న ఉద్యోగులను ఈ కోత నుంచి మినహాయించారు.
జూనియర్ పైలట్ల జీతాన్ని రూ. 1.40 లక్షల నుంచి రూ. 40వేలకు తగ్గించగా.. సీనియర్ పైలట్‌కు రూ. 3.45 లక్షల నుంచి రూ. లక్షకు తగ్గించారు. పైలట్ మొత్తం జీతంలో కోతపడిన వేతనం 40 శాతంగా ఉంటుందని ఎయిర్ ఏసియా అధికారులు వెల్లడించారు.
'రానున్న రోజుల్లో కొత్త సర్వీసులు కష్టమే'