తెలంగాణ

telangana

ETV Bharat / business

'ప్రైవేటీకరణ లేకపోతే.. ఎయిర్ఇండియాకు బై బై' - వాణిజ్య వార్తలు

ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణ జరగకపోతే.. మూసేవేతే మార్గమని విమానయాన మంత్రి హర్​దీప్​ పూరి అన్నారు. ఇదే విషయాన్ని రాజ్యసభలో స్పష్టం చేశారు.

airindia
ఎయిర్​ఇండియా

By

Published : Nov 27, 2019, 7:31 PM IST

సంక్షోభంలో చిక్కుకున్న.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ఇండియాపై కీలక వ్యాఖ్యలు చేశారు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి హర్​దీప్ సింగ్​ పూరీ. ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణ జరగకపోతే.. పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు రాజ్యసభలో పేర్కొన్నారు.

అయితే ఉద్యోగులందరికీ మేలు చేసే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

గతంలో ప్రయత్నం చేసినా..

ఎయిర్​ఇండియాలో పూర్తి వాటాను విక్రయించేందుకు.. బిడ్​లను ఆహ్వానిస్తోంది. ఇందులో పెట్టుబడుల ఉపసంహరణకు వచ్చే ఏడాది మార్చి 31ని తుది గడువుగా పెట్టుకుంది ప్రభుత్వం.

2018లోనే మోదీ తొలి ప్రభుత్వం.. ఎయిర్​ ఇండియాలో 75 శాతం వాటా విక్రయించేందుకు బిడ్లు ఆహ్వానించింది. అయితే అందుకు ఏ ప్రైవేటు కంపెనీ ముందుకు రాలేదు. ఈ కారణంగా మళ్లీ అ దిశగా ప్రయత్నాలు జరగలేదు.

ఎయిర్​ఇండియా ఛైర్మన్ అశ్వనీ లోహానీ సహా.. విమానయాన మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నారు. గతవారం మంత్రుల బృందం చర్చించి.. ఎయిర్​ఇండియాపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు హర్​దీప్​ పూరి తెలిపారు.

రాజ్యసభ సభ్యుల్లో ఒకరు.. ప్రైవేటీకరణకు ముందే పైలట్లు సంస్థలను వీడితే.. అని అడిగిన ప్రశ్నకు ఆయన ప్రతికూల సమాధానమిచ్చారు.

ఎయిర్​ఇండియా ప్రభుత్వం అండతోనే నడుస్తోందని.. యూపీఏ II ప్రభుత్వంలోనూ రూ.30,000 కోట్ల ప్యాకేజీని ఇచ్చిందని గుర్తుచేశారు.

ఇదీ చూడండి:'అనుమతిలేని పనులు కార్వీ చేసింది':సెబీ

ABOUT THE AUTHOR

...view details