తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​ ఇండియా విమానాలకు ఇంధన సరఫరా బంద్​

జెట్​ ఎయిర్​వేస్​లానే.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. కొన్ని రోజులుగా బాకాయిలు చెల్లించలేదని చమురు సంస్థలు ఎయిర్​ ఇండియా విమానాలకు ఇంధన సరఫరా నిలిపేయడమే ఇందుకు ఉదాహరణ.

ఎయిర్​ ఇండియా

By

Published : Aug 23, 2019, 1:42 PM IST

Updated : Sep 27, 2019, 11:51 PM IST

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎయిర్​ ఇండియాకు షాక్ ఇచ్చాయి. బాకాయిలు చెల్లించని కారణంగా విమానాలకు ఇంధన సరఫరా నిలిపేశాయి.

దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలకు(విశాఖపట్టణం, కొచ్చిన్, మోహాలీ, రాంచీ, పుణే, పట్నా) ఇంధన సరఫరా ఆపేసినట్లు చమురు సంస్థల సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎయిర్​ ఇండియాకు 'ఎటీఎఫ్' సరఫరా అపేసిన సంస్థల్లో ఇండియన్ ఆయిల్, భారత్​ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఉన్నాయి.

గత ఏడు నెలల నుంచి ఆయా సంస్థలన్నింటికీ కలిపి మొత్తం రూ.4,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది ఎయిర్​ఇండియా.

ఈ మూడు సంస్థలు వారం క్రితమే ఎయిర్​ఇండియాకు బకాయిలు చెల్లించమని నోటీసులు అందించాయి. గడువులోగా చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. అయినప్పటికీ బకాయిల చెల్లింపులో ఎయిర్​ఇండియా విఫలమైంది. ఈ నేపథ్యంలో తాజా చర్యలకు ఉపక్రమించాయి చమురు సంస్థలు.

అధికారిక గణాంకాల ప్రకారం ఎయిర్​ఇండియాకు మొత్తం రూ.58,000 కోట్లకు పైగా రుణభారం ఉంది.

ఇదీ చూడండి: ఏడాదిలో 4,600 కోట్ల​ జీబీ డేటా వాడేశాం

Last Updated : Sep 27, 2019, 11:51 PM IST

ABOUT THE AUTHOR

...view details