తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​ బ్యాగ్​ సమస్యలతో 60 లక్షల కార్లు రీకాల్​

కార్ల తయారీ సంస్థలు టయోటా, హోండా ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల కార్లను రీకాల్​ చేయనున్నాయి. ఆ సంస్థలకు చెందిన కార్లలో ఎయిర్​ బ్యాగ్​ సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

RECALL
ఎయిర్​ బ్యాగ్​ సమస్యలతో 60 లక్షల కార్లు రీకాల్​

By

Published : Jan 23, 2020, 12:43 PM IST

Updated : Feb 18, 2020, 2:39 AM IST

ఆటో మొబైల్​ దిగ్గజాలైన టయోటా, హోండా... భారీ సంఖ్యలో తమ కార్లను రీకాల్​ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు వాటి కార్లలో వేర్వేరు ఎయిర్​ బ్యాగ్​ సమస్యలను గుర్తించాయి. ఈ నేపథ్యంలో 60 లక్షల యూనిట్ల వరకు రీకాల్​ చేయాలని నిర్ణయించాయి.

టయోటా ఎయిర్​బ్యాగ్​ సమస్య..

తమ కార్లలో కొన్ని ప్రమాదానికి గురైనప్పుడు.. ఎయిర్​ బ్యాగ్​లు తెరుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించింది టయోటా. ఆ లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల కార్లను రీకాల్​ చేయనున్నట్లు ప్రకటించింది.

హోండా నుంచి 27 లక్షల కార్లు..

అమెరికా, కెనడాలో హోండా 27 లక్షల కార్లను వెనక్కి రప్పించనున్నట్లు తెలిపింది. టకాట ఎయిర్​ బ్యాగ్​లతో పని చేస్తున్న మోడళ్లను రీకాల్​ చేయనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:అట్లాస్‌ సైకిల్స్‌ అధినేత భార్య ఆత్మహత్య

Last Updated : Feb 18, 2020, 2:39 AM IST

ABOUT THE AUTHOR

...view details