Adani Wilmar IPO: ఫార్చూన్ బ్రాండుపై వంట నూనెలు విక్రయించే అదానీ విల్మర్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈనెల 27న ప్రారంభమై 31న ముగుస్తుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. ఇష్యూలో భాాగంగా రూ.3,600 కోట్ల విలువైన తాజా షేర్లను అదానీ విల్మర్ విక్రయిస్తుంది. ఈ నిధుల నుంచి రూ.1,900 కోట్లను మూలధన వ్యయాల కోసం, రూ.1,100 కోట్లను రుణాల చెల్లింపునకు, రూ.500 కోట్లను వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడుల నిమిత్తం అదానీ విల్మర్ వినియోగించనుంది.
అదానీ విల్మర్ ఇష్యూ ధర రూ. 218- 230 మధ్య ఉండనుంది. పెట్టుబడిదారు.. ఒక లాట్లో కనీసం 65 షేర్లు దక్కించుకునే అవకాశముంది.
రూ.37,195 కోట్ల ఆదాయంతో దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల్లో ఒకటిగా అదానీ విల్మర్ ఉంది. అదానీ గ్రూపు, సింగపూర్‌కు చెందిన విల్మర్ గ్రూపుల సంయుక్త సంస్థే అదానీ విల్మర్.