ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. వీటిలో భారీగా పెట్టుబడులు ఉన్న విదేశీ పెట్టుబడి సంస్థల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) నిలుపుదల చేసిందన్న వార్తలు ఇందుకు ప్రధాన కారణం. ఈ వార్తలతో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు సోమవారం అత్యధికంగా 24.99 శాతం తగ్గింది. దీనితో షేరు ధర రూ.1,201.10కు దిగొచ్చింది.
షేర్ల పతనం ఇలా..
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ షేరు 18.75 శాతం క్షీణించింది. షేరు ధర రూ.681.50కి తగ్గింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్ షేర్లు 5 శాతం చొప్పున పడిపోయాయి. అదానీ పవర్ 4.99 శాతం క్షీణించింది.