టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు జులైలో కొత్తగా 25 లక్షల యాక్టివ్ యూజర్లు పెరిగారు. దీనితో యాక్టివ్ యూజర్ల పరంగా జూన్లో ఎయిర్టెల్కు దక్కిన అగ్రస్థానాన్ని.. జులైలో జియో కైవసం చేసుకుంది. జులైలో ఇతర టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాకు వరుసగా 4 లక్షలు, 38 లక్షల యాక్టివ్ యూజర్లు తగ్గారు. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' తాజా గణాంకాల ద్వారా ఈ విషయం తెలిసింది.
దేశంలో మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా జులైలో 35 లక్షలు పెరిగినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత టెలికాం సబ్స్కైబర్ల సంఖ్య పెరగటం ఇదే తొలిసారని తెలిపింది. అయితే ఇదే నెలలో యాక్టివ్ సబ్స్కైబర్ల సంఖ్య మాత్రం 21 లక్షలు తగ్గినట్లు ట్రాయ్ వెల్లడించింది.
మొత్తం 1,144 మిలియన్ల వైర్లెస్ సబ్స్క్రైబర్లలో.. జులైలో 955.8 మిలియన్ల యూజర్లు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు తెలిపింది.