రిలయన్స్‌లోకి మరో రూ.5,512కోట్ల పెట్టుబడులు - రిలయన్స్ రిటైల్ ఇన్వెస్టమెంట్ న్యూస్

18:54 October 06
రిలయన్స్ రిటైల్‌లో మరో కంపెనీ పెట్టుబడి
రిలయన్స్ రిటైల్‌లో మరో అంతర్జాతీయ వ్యాపార సంస్థ అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(ఏడీఐఏ) భారీగా పెట్టుబడులు పెట్టనుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లో రూ.5,512.50 కోట్లతో 1.2 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈమేరకు వెల్లడించింది.
నాలుగు వారాల్లోనే సిల్వర్‌లేక్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబడాల, జీఐసీ, టీపీజీ, ఏడీఐఏ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆర్ఆర్వీఎల్లో రూ. 37,710 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.