సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకు రేపటి నుంచి యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో లిక్విడిటీకి (డబ్బులకు) ఎలాంటి సమస్యలు ఉండవని స్పష్టం చేశారు బ్యాంకు నూతన సీఈగా నియమితులైన ప్రశాంత్ కుమార్.
భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎస్ బ్యంకుపై ఈ నెల 5న ఆర్బీఐ మారటోరియం విధించింది. వినియోగదారులు రూ.50,000 వరకు మాత్రమే నగదు ఉపసంహరణకు అనుంతించింది. బ్యాంకును సంక్షోభం నుంచి బయటకు లాగేందుకు కేంద్రం ఉద్దీపనలు ప్రకటించగా.. రేపు (మార్చి 18) సాయంత్రం 6 గంటలకు మారటోరియం ఎత్తివేయనుంది ఆర్బీఐ.