అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా విద్యుత్తు స్కూటర్‌లోని(Ola Electric scooter) కొన్ని ఫీచర్లను ఈరోజు సంస్థ వెల్లడించింది. ద్విచక్రవాహనాల్లో చాలా అరుదుగా ఉండే రివర్స్ మోడ్‌ను దీనిలో పొందుపరిచినట్లు సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. 'రెవల్యూషన్ టు రివర్స్ క్లైమేట్ ఛేంజ్' అనే క్యాప్షన్‌తో స్కూటర్ రివర్స్‌లో వెళుతున్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. 'నమ్మశక్యంకాని వేగంతో స్కూటర్‌ను రివర్స్ చేయొచ్చు' అని రాసుకొచ్చారు. ద్విచక్రవాహనాల్లో రివర్స్ మోడ్ చాలా అరుదుగా ఉంటుంది. ఖరీదైన బైక్ అయిన హోండా గోల్డ్ వింగ్ సహా.. బజాజ్ చేతక్, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఈ-స్కూటర్లలో మాత్రమే ఈ ఫీచర్ ఉంది.
ఓలా స్కూటర్‌ను 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయొచ్చని గతంలో ఓ సందర్భంలో కంపెనీ వెల్లడించింది. ఈ సగం ఛార్జింగ్‌తో 75 కి.మీ వరకు ప్రయాణించొచ్చని తెలిపింది. వీటితో పాటు తాళంచెవి లేకుండా యాప్ ద్వారానే స్కూటర్‌ను స్టార్ట్ చేసే అత్యాధునిక ఫీచర్‌ను కూడా ఇందులో పొందుపరిచినట్లు సమాచారం.