వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థ్ బలవన్మరణంతో సంక్షోభంలో చిక్కుకున్న కేఫ్ కాఫీడే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (సీసీడీ) అప్పులు తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని 9 ఎకరాల ఐటీ పార్క్‌ను విక్రయించాలని నిర్ణయించుకుంది. 'గ్లోబల్ విలేజ్ పార్క్' పేరుతో ఉన్న ఈ ఐటీ పార్క్ కార్యకలాపాలను సీసీడీ భాగస్వామ్య సంస్థ 'టంగ్లిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్' నిర్వహిస్తోంది.
గ్లోబల్ విలేజ్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికా కేంద్రంగా పని చేస్తున్న 'బ్లాక్ స్టోన్' గ్రూపు 'టంగ్లిన్'తో ఇప్పటికే చర్చలు జరిపింది.