తమ పెట్టుబడి లక్ష్యాలను సాధించేందుకు 82 శాతం మంది మహిళలు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్‌లపై మొగ్గుచూపుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. 26,000 మంది మహిళలతో ఈ సర్వే నిర్వహించినట్లు పెట్టుబడి ప్లాట్‌ఫామ్ గ్రో వెల్లడించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలను పరిశీలిద్దాం
- 43 శాతం మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ల వంటి సంప్రదాయ పెట్టుబడి మార్గాలను ఇష్టపడుతున్నారు.
- 25 శాతం మంది బంగారంపై, స్థిరాస్తిపై 13 శాతం మంది, పింఛను పథకాలపై 9 శాతం మంది మక్కువ చూపుతున్నారు.
- 64 శాతం మంది మహిళలు ఆర్థిక అంశాల్లో పూర్తివిశ్వాసం ఉండటంతో పాటు పెట్టుబడి నిర్ణయాలను తామే తీసుకుంటున్నారు.
- రూ.5 లక్షల కంటే తక్కువ ఆర్జన కలిగిన మహిళల్లో 52 శాతం మంది షేర్లు, మ్యూచువల్‌ఫండ్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు.