తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రతి 10మంది మహిళల్లో 8మందికి వేధింపులు

భారత్​లోని మహిళలు ఫోన్ల ద్వారానే అధికంగా వేధింపులకు గురవుతున్నట్లు ట్రూకాలర్​ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. చెన్నై, దిల్లీ, పుణెలో ఈ వేధింపులు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

8 out of 10 women in India have faced harassment via calls, SMS: Truecaller
ప్రతి 10మంది మహిళల్లో 8మందికి ఫోన్లో వేధింపులు

By

Published : Mar 6, 2020, 8:55 PM IST

Updated : Aug 12, 2020, 4:50 PM IST

దేశవ్యాప్తంగా ప్రతి పది మంది మహిళల్లో ఎనిమిది మంది ఫోన్ల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. చెన్నై, దిల్లీ, పుణె నగరాల్లో ఈ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి మహిళలు ఎక్కువగా ఫోన్​ కాల్స్​, మెసేజ్​ల ద్వారా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ట్రూకాలర్ సంస్థ​ ఓ నివేదిక ద్వారా వెల్లడించింది.

ఈ సర్వేలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తేలింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సర్వే చేసిన అన్ని దేశాలతో పోల్చితే భారత్​లోనే ఎక్కువగా ఫోన్​ కాల్స్​, సంక్షిప్త సందేశాలపై మహిళలు చర్యలు తీసుకుంటున్నారు. 85 శాతం మంది నంబర్లను బ్లాక్​ లిస్ట్​లో పెడుతున్నారు. కేవలం 12 శాతం మంది మాత్రమే అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

" ఫోన్​ కాల్స్​, సంక్షిప్త సందేశాల ద్వారా అధికంగా మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు మేము గుర్తించాం. వీటిని అలాగే వదిలేయడం వల్ల బాధితులు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇలాంటి విషయాల్ని వదిలేయకుండా బయటకొచ్చి సదరు వ్యక్తులపై తగిన చర్యలు తీసుకునేలా మేము మహిళల్ని ప్రోత్సహిస్తున్నాం. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తేనే ఇటువంటి వేధింపులకు అడ్డుకట్ట వేయొచ్చు."

--- సందీప్​ పాటిల్​, ట్రూకాలర్​ మేనేజింగ్​ డైరెక్టర్​

భారత్​తో పాటు కెన్యా, కొలంబియా, బ్రెజిల్​, ఈజిప్ట్​లలో ఈ సర్వే నిర్వహించింది ట్రూకాలర్​ సంస్థ. ఈ దేశాల్లో 18 నుంచి 40 ఏళ్ల వయసున్న 1000 నుంచి 3,343 మందిపై సర్వే జరిపారు.

ఇదీ చదవండి:అన్నార్తులకు ఆలంబనగా ప్రజా పంపిణీ వ్యవస్థ

Last Updated : Aug 12, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details