తెలంగాణ

telangana

ETV Bharat / business

74.3% మంది ప్రయాణికులకు రీఫండ్

లాక్​డౌన్​ వల్ల రద్దయిన విమానాలకు ముందే టికెట్ బుక్​ చేసుకున్న వారికి విమాన సంస్థలు రూ.3,200 కోట్లు రీఫండ్ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 74.3 శాతం మంది ప్రయాణికులకు ఈ మొత్తాన్ని రీఫండ్ చేసినట్లు వివరించింది.

Rs 3,200 crore refund to flight cancellations passengers
లాక్​డౌన్​ వల్ల విమానం రద్దయిన 74.3 శాతం మందికి రీఫండ్

By

Published : Dec 12, 2020, 5:51 AM IST

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వల్ల రద్దయిన విమానాలకు ముందే టికెట్​ బుక్​ చేసుకున్న పాసింజర్లలో 74.3 శాతం మందికి రీఫండ్ ఇచ్చాయి విమాన సంస్థలు. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. మొత్తం రూ.3,200 కోట్లను రీఫండ్ ద్వారా వారికి అందించినట్లు వివరించింది.

మార్చి 25 నుంచి మే 24 మధ్య రద్దయిన విమానాలకు టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రీఫండ్ ఇచ్చినట్లు తెలిపింది.

లాక్​డౌన్​ కాలంలో దేశీయ-విదేశీ ప్రయాణాల కోసం బుక్​ చేసుకున్న టికెట్లకు సంబంధించిన నగదును.. వినియోగదారులకు విమాన సంస్థలే పూర్తిగా రీఫండ్​ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా విమాన సంస్థలు రీఫండ్ ఇచ్చినట్లు తెలిపింది మంత్రిత్వ శాఖ. మిగతా వారికీ.. త్వరలోనే రీఫండ్ చేయనున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:'రూ.1.45 లక్షల కోట్ల పన్ను రీఫండ్'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details