తెలంగాణ

telangana

ETV Bharat / business

మరో 10 రోజుల్లో టీవీ ధరలకు రెక్కలు!

దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు.. టీవీ ఓపెన్​ సెల్​ ప్యానెళ్లపై 5 శాతం దిగుమతి సుంకాన్ని మళ్లీ విధించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అక్టోబర్​ 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చాయి టెలివిజన్​ పరిశ్రమ వర్గాలు.

By

Published : Sep 20, 2020, 5:37 PM IST

5pc import duty on open cell used in TV manufacturing from Oct 1
మరో 10 రోజుల్లో టీవీ ధరలకు రెక్కలు!

మరికొద్దిరోజుల్లో టెలివిజన్​ ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీవీ ప్యానెల్స్​పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున.. ఆయా కంపెనీలు టీవీ ధరలు పెంచేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులకు పండుగ సీజన్​ ముందు ఇది బ్యాడ్​ న్యూస్​ అని చెప్పొచ్చు.

గతేడాది టీవీ ఓపెన్ సెల్ ప్యానెళ్లపై ప్రభుత్వం 5 శాతం దిగుమతి సుంకం రాయితీ ఇచ్చింది. ఇప్పుడు.. ఆ గడువు ముగుస్తున్న తరుణంలో అక్టోబర్​ 1 నుంచి తిరిగి 5 శాతం సుంకం విధించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్​ 30 తర్వాత మినహాయింపును పొడగించబోమని స్పష్టం చేశాయి.

టెలివిజన్​ ఖర్చులో దాదాపు 50 శాతానికి పైగా ఓపెన్​ సెల్​ ప్యానెళ్లకే అవుతుందని.. ఇప్పుడు 5 శాతం సుంకంతో టీవీల ధరలు 4 శాతం మేర పెరిగే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 32 అంగుళాల టీవీకి కనిష్టంగా 600 రూపాయలు, 42 అంగుళాల టీవీలపై 1,200 నుంచి 1,500 రూపాయల మేర ధరలు పెరుగుతాయని టీవీ తయారీ యాజమాన్యాలు అంటున్నాయి.

దేశీయ తయారీకి ఊతమిచ్చేందుకే..

సుంకం విధింపుతో.. క్లిష్టమైన ఓపెన్​ సెల్​ ప్యానెళ్ల దేశీయ తయారీకి ప్రోత్సాహం కలిగించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఏడాదికి సగటున రూ. 7,500 కోట్ల విలువైన టీవీల తయారీ ముడిపదార్థాలు దిగుమతి అవుతున్నాయని.. వీటిని తగ్గించేందుకే సుంకాన్ని పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ 5 శాతం సుంకం ఒక టీవీపై కేవలం రూ. 150-250 మధ్యే ఉంటుందని అంటున్నారు.

భారతదేశానికి దిగుమతి అయ్యే టెలివిజన్లపై 2017 డిసెంబర్​ నుంచి.. 20 శాతం సుంకాన్ని విధిస్తుంది ప్రభుత్వం. ఈ ఏడాది జులై నుంచి.. టీవీల దిగుమతిని కూడా పరిమితం చేసింది.

ఇదీ చూడండి: టీవీల దిగుమతులపై కేంద్రం కొత్త ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details