ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాంకింగ్, ఆర్థిక రంగ సేవల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాకు ఛార్జీలు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచింది. ఇవన్నీ ఆదివారం నుంచే అమల్లోకి రానున్నాయి. మరి రేపటి నుంచి జరగబోయే మార్పులేంటో.. ఓసారి చూద్దాం!
ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు పెంపు..
ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది. ఏటీఎం లావాదేవీలపై 2012 నుంచి ఇంటర్‌ఛేంజ్ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఒక బ్యాంకుకు చెందిన కస్టమర్ మరో బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, నిర్వహించేందుకు వ్యయాలు పెరగడంతో ఈ ఛార్జీలను పెంచుకునేందుకు ఆర్‌బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది.
ఐసీఐసీఐ ఖాతాదారులకు గమనిక..
ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై పరిమితిని విధించింది. ఈ కొత్త నిబంధనలూ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నగదు జమ, వెనక్కి తీసుకునేందుకు మొత్తం 4 ఉచిత లావాదేవీలనే అనుమతించనుంది. ఆ తర్వాత నుంచి ప్రతి లావాదేవీకి రూ.150 రుసుము విధిస్తుంది. మూడో వ్యక్తులు చేసే నగదు జమలపైనా పరిమితులు విధించింది. రూ.25,000 వరకూ రూ.150 రుసుము వసూలు చేయనుంది. ఆపై జమను అనుమతించదు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్‌బుక్‌కు రూ.20 చెల్లించాలి.
సెలవు రోజునా.. వేతనం క్రెడిట్..