తెలంగాణ

telangana

ETV Bharat / business

బొమ్మల దిగుమతిపై సుంకాల పెంపు.. ఉపాధికి గండి!

దిగుమతి సుంకాల పెంపును నిరసిస్తూ కోల్​కతాలో హోల్​సేల్ వ్యాపారులు నేడు సమ్మె చేపట్టారు. కేంద్రం నిర్ణయంతో అనేక మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

200 per cent import duty hike to hit toy business in India:Importers
బొమ్మల దిగుమతిపై సుంకాల పెంపు.. ఉపాధికి గండి!

By

Published : Feb 8, 2020, 11:54 PM IST

Updated : Feb 29, 2020, 5:06 PM IST

దిగుమతి సుంకాన్ని కేంద్రం 200 శాతం పెంచడాన్ని నిరసిస్తూ కోల్​కతాలో నేడు ఆందోళనకు దిగారు హోల్​సేల్ వ్యాపారులు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా లక్షకు పైగా రిటైలర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనకారులు తెలిపారు.

బొమ్మలపై 20 నుంచి 60 శాతం వరకు సుంకాలను పెంచాలని కేంద్రం తాజా బడ్జెట్​లో ప్రతిపాదించింది. దేశీయ వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

"దిగుమతి సుంకాన్ని 200శాతం పెంచుతూ ప్రతిపాదించడం నిజంగా దారుణమైన నిర్ణయం. ప్రజలు అమాంతం పెరిగిన ధరలకు బొమ్మలను కొనలేరు. ప్రస్తుతం కొనసాగుతున్న 20 శాతం పన్నును అమలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి"
-మోహిత్‌, పశ్చిమబెంగాల్‌ ఎగ్జిమ్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కోల్​కతా పర్యటనకు రేపు రానున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు, దిగుమతిదారులు ఆమెను కలిసే అవకాశముందని మోహిత్​ తెలిపారు.

బొమ్మల వ్యాపారం లెక్కలు..

ప్రతి ఏటా రూ.2,500 కోట్ల విలువైన బొమ్మలు, ఆటవస్తువులను భారత్​ దిగుమతి చేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. ఇందులో కేవలం చైనా నుంచే 75 శాతం దిగుమతి అవుతుండటం గమనార్హం.

ఇదీ చూడండి:రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి:ఆర్థిక మంత్రి

Last Updated : Feb 29, 2020, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details