తెలంగాణ

telangana

ETV Bharat / business

'మీ ఇన్​స్టాగ్రామ్​ పాస్​వర్డ్​ కూడా లీకైందా?' - lapse

ఇన్​స్టాగ్రామ్​లోని ఓ​ రక్షణలో లోపం లక్షలాది మంది ఖాతాదారులపై ప్రభావం చూపిందని ప్రకటించింది ఫేస్​బుక్​. సంఖ్యలు, సంజ్ఞలతో కాకుండా కేవలం అక్షరాల రూపంలో పాస్​వర్డ్​ పెట్టుకున్న వారికే ఈ సమస్య తలెత్తిందని చెప్పింది.

ఇన్​స్టాగ్రామ్​

By

Published : Apr 19, 2019, 11:06 AM IST

లక్షలాది మంది ఇన్​స్టాగ్రామ్​ ఖాతాదారులపై పాస్​వర్డ్​ రక్షణలోని ఓ లోపం ప్రభావం చూపించిందని మాతృసంస్థ ఫేస్​బుక్​ ప్రకటించింది. నాలుగు వారాల క్రితం ప్రకటించిన సంఖ్య కంటే మరింత ఎక్కువ మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రకటించింది.

సంఖ్యలు, సంజ్ఞలు లేకుండా కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఖాతాదారుల పాస్​వర్డ్​లను తమ ప్రమేయం లేకుండా అంతర్గత సర్వర్లు నిల్వ చేసుకున్నాయని ఫేస్​బుక్​ మార్చిలో ప్రకటించింది. దీని వల్ల తమ ఉద్యోగులు పాస్​వర్డ్​లను సులువుగా చూడగలిగారని చెప్పింది. అయితే... బయటి వ్యక్తులెవరూ పాస్​వర్డ్​లు తెలుసుకునే అవకాశమే లేదని స్పష్టం చేసింది.

ఫేస్​బుక్​, ఫేస్​బుక్​ లైట్​ యాప్​లను వినియోగించిన లక్షలాది వినియోగదారులకు పాస్​వర్డ్​కు సంబంధించిన రక్షణపరమైన లోపం ఉందని గుర్తించినట్టు మార్చిలోనే ప్రకటించింది సామాజిక మాధ్యమ దిగ్గజం.

ABOUT THE AUTHOR

...view details