తెలంగాణ

telangana

ETV Bharat / business

వేలంపైనే జెట్​ రుణదాతల ఆశలు - రుణ సంక్షోభం

జెట్​ ఎయిర్​వేస్​ను గట్టెక్కించేది అర్హులైన బిడ్డర్లేనని రుణదాతలు ఆశిస్తున్నారు. నిధుల కొరతతో గత అర్థరాత్రి నుంచి సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

జెట్​ ఎయిర్​వేస్​

By

Published : Apr 18, 2019, 12:59 PM IST

Updated : Apr 18, 2019, 3:10 PM IST

జెట్​ను తిరిగి గట్టెక్కించాలంటే సంస్థను నడపగలిగే సామర్థ్యం ఉన్న బిడ్డర్ల వల్ల మాత్రమే సాధ్యమని రుణదాతలు భావిస్తున్నారు.

ఇప్పటికే అర్హులైన వారినుంచి జెట్​ వాటా కొనుగోలుకు బిడ్​లను ఆహ్వానిస్తూ... ఏప్రిల్​ 16న 26 సంస్థలతో కూడిన రుణదాతల కన్సార్షియం నోటిఫికేషన్​ జారీ చేసింది.

జెట్​ నిర్వహణకు అత్యవసరంగా రూ. 400 కోట్లు అవసరమవ్వగా యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్​బీఐ అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో గత అర్థ రాత్రి నుంచి జెట్​ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

ఏడాది కనిష్ఠానికి షేర్లు

జెట్ మూతపడిన కారణంగా... స్టాక్​ మార్కెట్లో సంస్థ షేర్లు 30 శాతం నష్టంతో 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం బీఎస్​ఈలో షేర్​ ధర రూ.168.60 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Apr 18, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details