తెలంగాణ

telangana

ETV Bharat / business

11 కంపెనీలు.. రూ.60 లక్షల కోట్లు - అత్యంత విలువైన 500 కంపెనీలు

అత్యంత విలువైన కంపెనీలతో అంతర్జాతీయంగా భారత్​ పదో స్థానంలో నిలిచిందని 'హురున్​ గ్లోబల్​ 500' నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం.. భారత్​కు చెందిన 11 కంపెనీల విలువ 14 శాతం పెరిగి సుమారు రూ.60 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది దేశ జీడీపీలో మూడోవంతుకు సమానం. రిలయన్స్​కు ప్రపంచవ్యాప్తంగా 54, భారత్​లో తొలి స్థానం లభించింది.

Mukesh ambani
ముకేశ్​ అంబానీ

By

Published : Jan 13, 2021, 6:51 AM IST

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన తొలి 500 కంపెనీల జాబితాలో భారత్‌ నుంచి 11 ప్రైవేటు కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. ఇంత విలువైన కంపెనీలతో అంతర్జాతీయంగా భారత్‌ పదో స్థానంలో నిలిచిందని 'హురున్‌ గ్లోబల్‌ 500' నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం.. భారత్‌కు చెందిన 11 కంపెనీల విలువ 14 శాతం పెరిగి 805 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.60 లక్షల కోట్ల)కు చేరుకుంది. ఇది భారత జీడీపీలో మూడోవంతు కావడం విశేషం.

మొత్తం అంతర్జాతీయ 500 కంపెనీల విలువ 50 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది ప్రపంచంలోని ఆరు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల (అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ, భారత్‌, బ్రిటన్‌) సంయుక్త జీడీపీకి సమానం కావడం విశేషం. ఈ కంపెనీలు 4.3 కోట్ల మందికి ఉపాధినిస్తున్నాయి. జర్మనీ జనాభాతో ఇది సమానం. ఈ కంపెనీల విక్రయాలు(18 లక్షల కోట్ల డాలర్లు) చైనా జీడీపీ కంటే ఎక్కువ. జాబితాలో మరిన్ని ముఖ్యాంశాలు..

  • ముకేశ్‌ అంబానీ నేతృత్వంతోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశీయంగా అగ్రస్థానంలో నిలిచింది. డిసెంబరు 1 నాటికి కంపెనీ విలువ 20.5% పెరిగి 168.8 బి.డాలర్లకు చేరగా, అంతర్జాతీయంగా 54వ స్థానంలో చేరింది.
  • టీసీఎస్‌ విలువ 30 శాతం అధికమై 139 బిలియన్‌ డాలర్లకు చేరింది. దేశీయంగా రెండు, ప్రపంచవ్యాప్తంగా 73వ స్థానాల్లో నిలిచింది.
  • 11 అత్యంత విలువైన కంపెనీల్లో ఏడు ముంబయిలోనే ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి. పుణె, బెంగళూరు, కోల్‌కతా, దిల్లీలలో మిగతా నాలుగు తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి.
  • టాప్‌-500 జాబితాలో యాపిల్‌ 2.1 లక్షల కోట్ల డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. 1.6 లక్షల కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.
  • అగ్రగామి 500 సంస్థల్లో 242 అమెరికాలోనే ఉన్నాయి. చైనాలో 51, జపాన్‌లో 30 ఉన్నాయి. చైనా కంపెనీల విలువ 73 శాతం పెరిగింది.
    భారత కంపెనీల విలువ

ఇదీ చూడండి:2020లో 80శాతం పెరిగిన డిజిటల్‌ చెల్లింపులు

ABOUT THE AUTHOR

...view details