కొవిడ్(COVID-19) చికిత్స కోసం తయారు చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్పై హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) అనుమతులు కోరతున్నట్లు జైడస్ క్యాడిలా(Zydus Cadila) వెల్లడించింది. తొలి దశ ట్రయల్స్ కోసం కసరత్తులు చేస్తున్నట్లు తెలిపింది.
Zydus Cadila: సరికొత్త డ్రగ్‌పై హ్యూమన్ ట్రయల్స్! - కొవిడ్ కాక్టెయిల్ డీసీజీఐ
కొవిడ్ రోగుల కోసం తయారు చేసిన యాంటీబాడీ కాక్టెయిల్ జడ్ఆర్సీ-3308పై హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించేందుకు జైడస్ క్యాడిలా సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన అనుమతుల కోసం డీసీజీఐని ఆశ్రయించింది.
![Zydus Cadila: సరికొత్త డ్రగ్‌పై హ్యూమన్ ట్రయల్స్! Zydus Cadila antibodies cocktail human clinical trials](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11918553-584-11918553-1622112156678.jpg)
జడ్ఆర్సీ-3308 పేరుతో ఈ యాంటీబాడీ కాక్టెయిల్ను అభివృద్ధి చేసింది జైడస్ క్యాడిలా. జంతువులపై చేసిన అధ్యయనంలో ఇది సురక్షితమే అని తేలింది. కొవిడ్ చికిత్స కోసం మోనోక్లోనల్ యాంటీబాడీ ఆధారిత కాక్టెయిల్ను అభివృద్ధి చేసిన ఏకైక భారతీయ సంస్థ తమదేనని జైడస్ తెలిపింది. కొవిడ్ రోగులకు చికిత్స కోసం అనేక విధానాలను కనిపెట్టాల్సిన అవసరం ఉందని, జడ్ఆర్సీ-3308 ఈ దిశగా సమర్థంగా పనిచేస్తుందని భావిస్తున్నామని క్యాడిలా హెల్త్‌కేర్ ఎండీ డా. శార్విల్ పటేల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి-త్వరలో అందుబాటులోకి జైడస్ టీకా!