తెలంగాణ

telangana

ETV Bharat / business

నియమాలు ఉల్లంఘిస్తున్న యూట్యూబ్​ స్టార్స్ - ప్రకటనలు

యూట్యూబ్​కు ప్రధాన ఆదాయవనరు​ ప్రకటనలు. ఈ ఆదాయం కోసం సంస్థ.. తన నిబంధనలు తానే ఉల్లంఘిస్తోందని పలువురు యూట్యూబ్​ మోడరేటర్లు అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా స్టార్​ యూట్యూబర్లు అనుచిత, విద్వేషపూరిత వీడియోలను అప్​లోడ్​ చేస్తున్నా, ఉదాసీనంగా ఉంటోందని, వారికి మినహాయింపులు ఇస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను యూట్యూబ్​ ఖండించింది.

నియమాలు ఉల్లంఘిస్తున్న యూట్యూబ్​ స్టార్స్

By

Published : Aug 11, 2019, 9:31 AM IST

యూట్యూబ్​ స్టార్స్... కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవాలు. ఈ తారల మూలంగా వచ్చే ప్రకటనల ద్వారానే మీడియా దిగ్గజం యూట్యూబ్ కోట్లాది డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అందుకే వీరు నియమాలు ఉల్లంఘించినా యూట్యూబ్ చూసీచూడనట్లు వదిలేస్తుందని విమర్శలొస్తున్నాయి.

వీళ్లకు మినహాయింపులు ఎందుకు?

కొంతమంది మోడరేట్లు ... లోగాన్ పాల్​, స్టీవెన్​ క్రౌడర్, ప్యూడిపై లాంటి స్టార్లకు యూట్యూబ్ మినహాయింపులు ఇస్తోందని ఆరోపిస్తున్నారు.

"అత్యంత జనాదరణ పొందిన లోగాన్​పాల్, స్టీవెన్​ క్రౌడర్​, ప్యూడిపై లాంటి యూట్యూబ్​ స్టార్లు... తరచుగా సంస్థ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ద్వేషపూరిత వీడియోలను అప్​లోడ్​ చేస్తున్నారు. అయినప్పటికీ ఆదాయమే పరమావధిగా యూట్యూబ్​ వారిపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది."

- కొంతమంది యూట్యూబ్​ మోడరేటర్లు​

ఖండిస్తున్నాం..

గూగుల్​ యాజమాన్యంలో యూట్యూబ్​ ఈ ఆరోపణలను ఖండించింది. ద్వేషపూరిత, హానికర వీడియోలను తన ప్లాట్​ఫాంలో అనుమతించబోమని తెలిపింది. నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ, వ్యాపారం నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది.

విశేష ఆదరణే.... సమస్య

ప్రపంచంలో అతిపెద్ద వీడియో ప్లాట్​ఫాం అయిన యూట్యూబ్​లో నెలకు సుమారు 2 బిలియన్ల మంది లాగిన్ అవుతుంటారు. అందువల్ల కొంతమంది ద్వేషపూరిత, అనుచితమైన కంటెంట్​ను అప్​లోడ్​ చేసే అవకాశం ఉంది. వీరిని నియంత్రించేందుకు యూట్యూబ్..​ మార్గదర్శకాలను రూపొందించింది.

ఈ నిబంధనలను స్టార్ యూట్యూబర్లు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ తారల వల్లే ప్రకటనల ఆదాయం వస్తుంది కనుక యూట్యూబ్​ కూడా ఉదాసీనత చూపిస్తోందని మోడరేటర్లు ఆరోపిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే...

యూట్యూబ్​ క్రియేటర్లు నియమాలను ఉల్లంఘిస్తే వారి వీడియోలు, ఛానళ్లపై ప్రకటనలు నిషేధిస్తారు. లేదా పూర్తిగా ఛానళ్లనే తీసివేస్తారు. వారి కంటెంట్​ కూడా పూర్తిగా తొలగించివేస్తారు.

ఫేస్​బుక్​, ట్విట్టర్​ల్లో... క్రియేటర్లు తమ కంటెంట్​ను స్వయంగా తొలగించగలరు. కానీ యూట్యూబ్​లో చాలా మంది మోడరేటర్లు తమ కంటెంట్​ను స్వయంగా తొలగించలేరు. కేవలం తమ కంటెంట్​ సురక్షితమైంది అవునా, కాదా అనేది మాత్రమే తెలుపగలుగుతారు. యూట్యూబ్​ మాత్రమే వారి కంటెంట్​ను నియంత్రించగలదు.

పక్షపాతం వద్దు..

వాషింగ్టన్​పోస్టు చేసిన ఇంటర్వ్యూలో.... కొంతమంది యూట్యూబ్​ మోడరేట్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. హై ప్రొఫైల్ యూట్యూబర్లు నియమాలు ఉల్లంఘించినా కూడా వారి వీడియోలపై ప్రకటనలు అధికంగా వస్తున్నాయని ఆరోపించారు.

యూట్యూబ్ తీసుకునే ఇలాంటి తాత్కాలిక, ఏకపక్ష నిర్ణయాలు పని వాతావరణాన్ని నిరుత్సాహ పరుస్తాయని మోడరేట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిరంతరం యూట్యూబ్​ నిబంధనలు మార్చడమూ సరైన విధానం కాదని వారు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: రష్యాలో క్షిపణి పరీక్ష విఫలం.. ఐదుగురు మృతి!

ABOUT THE AUTHOR

...view details