Youtube Offline Video Download: ఎప్పుడైనా బోర్ కొడితే యూట్యూబ్ తెరుస్తాం. కావాల్సినంత సేపు విహరిస్తాం. సాధారణంగా డౌన్‌లోడ్ చేసేందుకు మొగ్గు చూపం. అయితే, డేటా వేగంలో ఇబ్బందులున్న వారైతే తమకు కావాల్సిన వీడియోలను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటారు. తర్వాత నచ్చినప్పుడు చూసుకుంటారు.
రెండు ప్రయోజనాలు..
ఒకటి ఇంటర్నెట్ వేగంతో సంబంధం లేదు కాబట్టి వీడియో బఫర్ అవుతుందన్న బాధ లేదు. పైగా ఎన్నిసార్లయినా చూసుకోవచ్చు. రెండోది ఆఫ్‌లైన్ వీడియోలకు ప్రకటనలు రావు. అయితే, ఇప్పుడు ఇలా ఆఫ్‌లైన్‌లో వీడియోలు డౌన్‌లోడ్ చేసుకునే వారికి యూట్యూబ్ షాకిచ్చింది. మునుపటిలా వీడియోలను హై, ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం ఇకపై కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. అంటే నెలనెలా డబ్బులు కట్టాలన్నమాట!