సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంకుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీలోని బ్యాంకింగ్ ఇండెక్స్ నుంచి ఎస్ బ్యాంకు షేర్లను తొలగిస్తున్నారు. మార్చి 27 నుంచి ఈ మార్పు అమలులోకి వస్తుందని..ఎస్ బ్యాంక్ స్థానాన్ని బంధన్ బ్యాంకు భర్తీ చేయనుందని ఎన్ఎస్ఈ తెలిపింది.
ఎస్ బ్యాంకు షేర్లలో ఫీచర్ అండ్ ఆప్షన్స్ ఒప్పందం అందుబాటులో లేకపోవటమే ఇందుకు కారణమని ఎన్ఎస్ఈ ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో పాటు మార్చి 29 నుంచి ఫీచర్స్ అండ్ ఆప్షన్ల విభాగం నుంచి బయటకు వెళ్లనుందని స్పష్టం చేసింది.
ఇవి కూడా...
బ్యాంకింగ్ ఇండెక్స్‌తో పాటు నిఫ్టీ ఆల్ఫా-50, నిఫ్టీ హై బీటా-50, నిఫ్టీ-500, నిఫ్టీ స్మాల్ క్యాప్-250, నిఫ్టీ మిడ్‌స్మాల్ క్యాప్-400 ఇండెక్స్లలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. మార్పులు చేసుకుంటున్న ఇండెక్స్‌లలో కొత్త వాటిని చేర్చేందుకు ఓ కమిటీని నిర్వహిస్తోంది ఎన్ఎస్ఈ.
గాయత్రి ప్రాజెక్ట్స్ కూడా నిప్టీ-500, నిఫ్టీ స్మాల్‌క్యాప్-250, నిప్టీ స్మాల్ క్యాప్-400 ఇండీసెస్ నుంచి బయటకు వెళుతున్నట్లు ఎన్ఎస్ఈ ప్రకటించింది. దాని స్థానంలో శిల్పా మెడికేర్ వస్తుందని తెలిపింది.
ఇదీ చదవండి:ఎస్ బ్యాంకులో ఎస్బీఐ పెట్టుబడి రూ.7,250 కోట్లు