తెలంగాణ

telangana

ETV Bharat / business

డిసెంబర్ త్రైమాసికంలో ఎస్​ బ్యాంకు నష్టం రూ.18,564 కోట్లు - yes bank crisis

ఎస్​ బ్యాంకు డిసెంబర్ త్రైమాసికంలో రూ.18,564 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఏడాది క్రితం ఇదే బ్యాంకు రూ.1000 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. మార్చి 5న ఎస్​ బ్యాంకుపై ఆర్​బీఐ మారటోరియం విధించింది. దీన్ని మార్చి 18న ఎత్తివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Yes Bank reports Rs 18,564-cr loss for Dec quarter
డిసెంబర్ త్రైమాసికంలో ఎస్​ బ్యాంకు నష్టం రూ.18,564 కోట్లు

By

Published : Mar 15, 2020, 5:54 AM IST

సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఎస్​ బ్యాంకు డిసెంబర్ త్రైమాసికంలో రూ.18,564 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతకు ముందు సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.629 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే బ్యాంకు రూ.1000 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం.

ఎస్​ బ్యాంకు మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల వాటా 18.87 శాతానికి పెరిగింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 7.39 శాతంగా ఉంది. మరోవైపు క్యాపిటల్ బఫర్లు కూడా క్షీణించాయి.

డిసెంబర్ త్రైమాసికం నాటికి ఎస్​ బ్యాంకు మూలధన సమృద్ధి నిష్పత్తి (క్యాపిటల్ ఆడిక్వసీ రేషియో) 4.2 శాతానికి పడిపోయింది. ఇది సెప్టెంబర్ త్రైమాసికం చివర్లో నివేదించిన 16.3 శాతంలో దాదాపు నాలుగో వంతు. రెగ్యులేటరీ అవసరాల కంటే ఇది చాలా తక్కువ.

మార్చి 5న ఎస్​ బ్యాంకుపై ఆర్​బీఐ మారటోరియం విధించింది. దీన్ని మార్చి 18న ఎత్తివేయనున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఆర్​బీఐ ప్రశాంత్ కుమార్​ను ఎస్ బ్యాంకు నిర్వాహకుడిగా నియమించింది. ఆయన పర్యవేక్షణలోనే డిసెంబర్​ త్రైమాసిక ఫలితాలు వెలువడ్డాయి. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించిన పునర్నిర్మాణ ప్రణాళిక ప్రకారం, ప్రశాంత్​ కుమార్... ఎస్ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్​గా వ్యవహరించనున్నారు.

ఇదీ చూడండి:పెరగనున్న ఫోన్ల ధరలు.. కారణమదే

ABOUT THE AUTHOR

...view details