తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​ బ్యాంక్ కేసులో అంబానీకి ఈడీ సమన్లు - ఎస్​ బ్యాంకు తాజా వార్తలు

ఎస్​ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్​పై నమోదు చేసిన మనీలాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా రిలయన్స్​ గ్రూప్​ ఛైర్మన్ అనిల్​ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు తేదీని మార్చాలని అంబానీ ఈడీని కోరినట్లు అధికారులు తెలిపారు.​

Yes Bank: ED summons Anil Ambani
ఎస్​ బ్యాంక్ కేసులో అంబానీకి ఈడీ సమన్లు

By

Published : Mar 16, 2020, 11:15 AM IST

ఎస్​ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్​, తదితరులపై మనీలాండరింగ్​ కేసులో దర్యాప్తునకు సంబంధించి.. రిలయన్స్​ గ్రూప్​ ఛైర్మన్​ అనిల్​ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్​ బ్యాంకు నుంచి అంబానీ గ్రూపు కంపెనీలు సుమారు రూ. 12,800 కోట్ల రుణాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం రావడం కుదరదని.. హాజరు తేదీని మార్చాలని అంబానీ ఈడీని కోరినట్లు అధికారులు తెలిపారు.

అన్ని కార్పొరేట్​ కంపెనీలకు సమన్లు

ఎస్ ​బ్యాంకుతో ముడిపడిన కంపెనీలల్లో అనిల్​ అంబానీ గ్రూప్​, ఎస్సెల్​, ఐఎల్​ఎఫ్​ఎస్​, డీహెచ్​ఎఫ్​ఎల్​, వొడాఫోన్​ ఉన్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఎస్​ బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో రుణాలు తీసుకున్న అన్ని కార్పొరేట్​ కంపెనీలకు చెందిన వ్యవస్థాపకులకు.. దర్యాప్తులో భాగంగా సమన్లు పంపించనున్నట్లు అధికారులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details