చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ... 'రెడ్మీ 8ఏ'ను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కొన్ని వారాల క్రితం లాంచ్ అయిన రెడ్మీ 7 ఏకు తరువాతి మోడల్‌గా దీన్ని షియోమీ తీసుకొచ్చింది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆరావేవ్ డిజైన్‌తో ఓషన్ బ్లూ, రెడ్, మిడ్నైట్ బ్లాక్.. అనే మూడు కలర్ వేరియంట్లతో లభిస్తుంది. 6.2 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే (19.5:9 యాస్పెక్ట్ రేషియో), క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో వస్తుంది.
ఈ విభాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వచ్చిన మొదటి ఫోన్ ఇదేనని షియోమీ చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ 'ఆండ్రాయిడ్ 9 పై' అధారంగా ఎమ్ఐయూఐతో పనిచేస్తుంది.
రెడ్మీ నోట్ 8ఏ ఫీచర్లు ఇవే:
- టియర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- యూఎస్బీ టైప్-సి పోర్ట్ (మొదటి సారిగా)
- ఫాస్ట్ ఛార్జింగ్ (18 డబ్ల్యూ)
- గొరిల్లా గ్లాస్ 5
కెమెరాలు
- ఫోన్ వెనుకవైపు సోనీ ఐఎమ్ఎక్స్ 363 కెమెరా సెన్సార్ (12 ఎమ్పీ)
- సెల్ఫీ కెమెరా (8ఎమ్పీ సెన్సార్)